ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 3:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీకి తరలిన పెద్దపల్లి జిల్లా,కాంగ్రెస్ శ్రేణులు.

ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీకి తరలిన పెద్దపల్లి జిల్లా,కాంగ్రెస్ శ్రేణులు.

రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన ర్యాలీ… .ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొన్న మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్.

న్యూఢిల్లీ, నవంబర్ 1 (అర్జున్ సమాచారం డెస్క్.)

ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహిస్తున్న భారీ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నివాసంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణను కలిశారు.

అనంతరం ఎంపీ నివాసం నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలతో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి బయలుదేరారు.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని తమ నిరసనను తెలియజేయనున్నాయి.